ఘనంగా మిలాద్- ఉన్- నబి ఉత్సవాలు

67చూసినవారు
ఘనంగా మిలాద్- ఉన్- నబి ఉత్సవాలు
నర్వ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకొని మిలాద్- ఉన్- నబి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ముస్లిం మత పెద్దలు ఊరేగింపు నిర్వహించి మాట్లాడుతూ, చెడును విడనాడి మనిషి సన్మార్గంలో నడవాలని మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణలో ఉన్నాయన్నారు. అలాగే సర్వ మానవ ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు పోలీసు బలగాలు చేరుకున్నాయి.
Job Suitcase

Jobs near you