మక్తల్: అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో

80చూసినవారు
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఇతర నాయకుల అరెస్టులను నిరసిస్తూ బుధవారం మక్తల్ పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులకు వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూనే నిర్బంధం ఏంటని నాయకులు ఆశిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు.