మక్తల్ పట్టణంలోని బురాన్ గడ్డ వీధిలో ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించారు. మురుగునీటి సమస్య పరిష్కరించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామని, నూతన రోడ్ల నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు శంశోద్దీన్, ఫయాజ్, రహీం పటేల్, నయుమ్, మంజూర్, రఫీ, నవాజ్, హమీద్ పాల్గొన్నారు.