త్రాగు నీరే కాదు! సాగునీటి ప్రాజెక్టుతో నియోజకవర్గం తో పాటు అమ్రాబాద్ అప్పర్ ప్లాట్ భూములను పచ్చదనంతో సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1 ఫేస్ 2 మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల పరిధిలోని మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచ పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరందించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతానన్నారు. ప్రాంతాలు వేరైనా కృష్ణ నదిపై వంతెన నిర్మాణంతో రెండు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ తో ఎమ్మెల్యే పదవి చేపట్టానని, ప్రజల ఆశీర్వాదంతో అచ్చంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియామకాలతో పాటు సీసి రోడ్ల నిర్మాణాలు, ప్రాంతీయ, జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం రాయల గండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాంబాబు నాయక్, బీఅర్ ఎస్ మండల అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు యాదవ్, ఆలయ చైర్మన్ విష్ణుమూర్తి, ఉపాధ్యక్షుడు దాసరి ఎల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి అనిల్, ఎంపిటిసిలు ఎల్లమ్మ శ్రీనివాసులు, సునీత శ్రీనివాసులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.