పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని టీడీపీ పార్లమెంట్ అడ్ హక్ కమిటీ సభ్యులు రాములు యాదవ్ అన్నారు. శుక్రవారం దామరగిద్ద మండలం కందెన్ పల్లి గ్రామంలో టీడీపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. సభ్యత్వం తీసుకున్న వారికి అయిదు లక్షల ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉందన్నారు.