డాక్టర్, జూనియర్ డాక్టర్ల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం వుందని పివైఎల్ నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు సలీం అన్నారు. కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.