వనపర్తిలో వినూత్నంగా గణపతి నిమజ్జనం

85చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రీన్ పార్కులో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనం వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు మంగళవారం రాత్రి గంగమ్మ ఒడికి చేరాడు. బాణసంచా కాంతులు, సన్నాయి మేళాల మధ్య శోభాయాత్ర సందడిగా సాగింది. తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పట్టణ ప్రధాన రహదారులు, కూడళ్లలో శోభాయాత్ర కొనసాగింది.

సంబంధిత పోస్ట్