వనపర్తి: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

55చూసినవారు
మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మున్సిపల్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్