జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో

85చూసినవారు
జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో
వనపర్తి జిల్లా జూరాలకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో మరింత తగ్గు ముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి కేవలం 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు తెలిపారు. కాగా 9 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ మేరకు విద్యుత్తు ఉత్పత్తికి 22, 241 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా 24, 695 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9. 275 టీఎంసీల నీరు నిల్వఉంది.

సంబంధిత పోస్ట్