ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి: ఎస్పీ

56చూసినవారు
ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి: ఎస్పీ
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులను ఫిర్యాదుదార్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్