కుటుంబ సర్వేను పరిశీలించిన వనపర్తి కలెక్టర్ సురభి

68చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ఖానాపురంలో నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేను బుధవారం కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాలు పక్కగా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శశిధర్, మండల తహశీల్దార్ షేక్ చాంద్ పాషా, మండల ప్రత్యేక అధికారి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్