వనపర్తి: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

68చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని మాట్లాడుతూ. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకొని బాధ్యతతో నడుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా రాణించాలని అన్నారు. మహిళల సంక్షేమం, రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించిందని విద్యార్థి దశ నుండే వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్