రైళ్లలో 'జన'రల్ కష్టాలు

3301చూసినవారు
పేదలు, శ్రామికుల రవాణా సాధనం రైల్వే. అటువంటి రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్యాసింజర్లు చుక్కలు చూస్తున్నారు. చాలా ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో రెండే జనరల్ బోగీలు ఉండటంతో గంటలపాటు నిలబడి ప్రయాణిస్తూ నరకం అనుభవిస్తున్నారు. నడిచే దారిలో కూర్చోవడం, పడుకోవడం, టాయిలెట్లలోనూ ప్రయాణికులు నిండిపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారుల బాధలు వర్ణనాతీతం. కొన్ని రైళ్లు ఎక్కేందుకు పెద్ద పోరాటం చేయాల్సి వస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్