ఉదారత చాటుకున్న ఎంపీ రవికిషన్ (వీడియో)

82చూసినవారు
బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ శనివారం మరోసారి ఉదారత చాటుకున్నారు. యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి మరోసారి బీజేపీ ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. బహిరంగ సభకు వెళ్తుండగా, రోడ్డుపై గాయపడిన మహిళను ఆయన చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి అక్కడకు వెళ్లారు. తన వాహనంలో గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆమె ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :