చైనాలోని హెబీలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి స్కై లిఫ్ట్ ఎక్కింది. అయితే స్కై లిఫ్ట్ లో కేబుల్ కార్‌కు వేలాడుతూ ఆమె కనిపిస్తుంది. కొంత సేపటికి ఆ అమ్మాయి పైనుంచి కిందపడింది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి బాలిక కింద పడిపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.