బక్రీద్ రోజున ఖుర్భానీ ఇవ్వడం అనవాయితీ

78చూసినవారు
బక్రీద్ రోజున ఖుర్భానీ ఇవ్వడం అనవాయితీ
ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడరని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు అంటుంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు.