కుమ్రం భీంకు పునర్ వైభవం

65చూసినవారు
కుమ్రం భీంకు పునర్ వైభవం
నైజాం- బ్రీటీష్ పాలకులతో ఏకకాలంలో పెద్దపులిలా విరుచుకుపడ్డ కుమ్రం భీం పోరాటాలను, ఆయన ప్రాణత్యాగాన్ని నాటి పాలకులు, చరిత్రకారులు గుర్తించలేదు. అయినా కూడా ఆయన ఇక్కడి ప్రజలు గుండెల్లో ఆరాధ్య దైవంగా కొలువుదీర్చుకున్నాడు. భీం రగిల్చిన విప్లవ జ్యోతి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగా మండుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీం చరిత్రకు పునర్ వైభవం దక్కింది. ఒక జిల్లాకు పేరు, అక్కడ ఓ మ్యూజియం, స్మారక చిహ్నం ఏర్పాటు చేసింది. పుస్తకాల్లో ఆయన చరిత్ర పాఠ్యాంశంగా చేర్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్