తెలంగాణలో పత్తి కొనుగోళ్లు పున:ప్రారంభం అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. CCI వైఖరికి నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు ఆపివేయాలని కాటన్ మిల్లర్లు, ట్రేడర్లు సంక్షేమ సంఘం నిర్ణయించడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సీసీఐ CMD, కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం అధికారులతో చర్చలు జరిపారు. అభ్యంతరాలు పరిష్కారం కావడంతో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.