రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు వేసవికాలంలో సాగునీరందక ఇబ్బంది పడుతుంటారు. నీటి ఎద్దడితో పంట దెబ్బతినే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ఉద్యాన శాఖ ఫారం ఫండ్‌ను వినియోగించుకునేలా రైతన్నలను ప్రోత్సహిస్తుంది. అధికారుల సూచన మేరకు నీటి స్టోరేజీ ట్యాంకులను నిర్మించేవారికి సుమారు రూ.75 వేలు సబ్సిడీ ఇవ్వనున్నారు.