గుజరాత్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు(వీడియో)

84చూసినవారు
వరుస రైలు ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. యూపీలో ఇటీవల జరిగిన రైలు ప్రమాద ఘటన మరువకముందే గుజరాత్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వల్సాద్‌లో శుక్రవారం సాయంత్రం గూడ్స్‌ ట్రైన్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్