హోండా కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి బుధవారం విడుదల చేయనుంది. ఈ స్కూటర్ అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైకులో LED లైట్లు, డిజిటల్ స్పీడోమీటర్, డ్రైవింగ్ కోసం రేంజ్ ఎంపికలు, బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక ఫీచర్లున్నాయి. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్కూటర్ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. భారత మార్కెట్లో రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయవచ్చు.