విజయనిర్మల కుమారుడు నరేష్ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 46 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల అని, అమ్మకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లానని, అయినా ఫలితం లేదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అవార్డుకు అమ్మ పేరు రికమెండ్ చేశారని, తన తల్లికే కాకుండా చాలామంది గొప్పవారికి పద్మ అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.