ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్మితా శ్రీ వాస్తవ (46).. అత్యంత పొడవాటి జుట్టును కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి జుట్టును కత్తిరించడం మానేసింది. అంతేగాదు జుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు జుట్టును సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని తెలిపింది.