శీతాకాలం వచ్చిందంటే వాతావరణంతో పాటు శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. పెదాలు, మడమలు, చర్మంపై పగుళ్లు వస్తాయి. దాహం, ఆకలి లేకపోవడం వంటివి జరుగుతాయి. చలి వల్ల శరీరంలో అరుగుదల క్షీణించి ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ సమస్యకి మెంతి జ్యూస్ ఔషధంలా పని చేస్తుందని.. రోజు ఉదయాన్నే మెంతి జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.