ఉత్తరప్రదేశ్‌లోని డియోరాలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. తమ ‘భర్త’లపై ద్వేషం.. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు మహిళలు తమ భర్తల చేతిలో మానసికంగా నరకం చూశారు. అనుకోకుండా వారికి ఇన్‌స్టాగ్రాంలో పరిచయం అయింది. ఇద్దరిదీ ఒకే సమస్యగా ఉండడంతో వారిద్దరూ ఏకమయ్యారు. ఒకరినొకరు వివాహం చేసుకుని తమ భర్తలను వదిలేశారు. ఆరేళ్ల నుంచి అలా ఇబ్బంది పడుతున్న వారు గురువారం వివాహం చేసుకున్నారు.