ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విమానాలు రద్దు చేసిన ఇరాన్‌!

78చూసినవారు
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విమానాలు రద్దు చేసిన ఇరాన్‌!
ఇజ్రాయెల్‌‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తాజాగా అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాన్‌ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమలులో ఉండనుంది. లెబనాన్‌ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. రాజధాని బీరుట్‌ నుంచి అన్ని విమానాలను రద్దు చేసింది. ఇజ్రాయెల్‌ ఏ సమయాన దాడి చేస్తుందోననే ఊహాగానాల నేపథ్యంలో ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.