పని ఒత్తిడి మానసిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడితో మొత్తం ఆరోగ్యం మీద పడే ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. తీవ్రమైన ఒత్తిడి శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజంను ప్రేరేపిస్తుంది. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, హృద్రోగాలు, జీర్ణసంబంధ రుగ్మతలు తలెత్తుతాయి.