హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాత్రి కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి 11 నుంచి ఇవాళ తెల్లవారుజాము 3 గంటల వరకు ఏకధాటిగా వాన పడింది. ఉప్పల్, మల్లేపల్లి, మాదాపూర్, యూసూఫ్ గూడ, జూబ్లీహిల్స్, అమీర్ పేట, బోరబండ, కొండాపూర్, లింగంపల్లి, అమీన్పూర్, చందానగర్, సంతోష్ నగర్, ఈసీఐఎల్, సరూర్ నగర్, సికింద్రాబాద్, కొంపల్లి, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లు, ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి.