నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్, సైంటిస్ట్ కెవిఎస్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని డైరెక్టర్ తెలిపారు. విశాఖ, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలోని భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు తుఫాన్ సమీపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు తెలిపారు.