నేపాల్‌లో ఓ హెలికాప్టర్ బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నువాకోట్ జిల్లా సూర్యచౌర్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీస్ అధికారి శాంతి రాజ్ కోయిరాలా తెలిపారు. హెలికాప్టర్ సూర్యచౌర్ కొండను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.