బచ్చలికూర శరీరానికి శీతల గుణాన్నిస్తుంది. నీరింకే అన్ని భూముల్లో పండించవచ్చు. ఎకరాకు 12 కిలోల విత్తనం అవసరం. రూ.8-10 వేలు వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. నాటిన నెల తర్వాత కోత మొదలవుతుంది. పంట కాలం 3 నుంచి 4 నెలలు. నీటిపారుదల సవ్యంగా అందిస్తే ఆరు నెలలు కూడా ఉంటుంది. నాలుగు నెలల్లో నాలుగు కోతలతో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.