మధ్యప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిని కొంతమంది హిజ్రాలు కొట్టి చంపారు. ఆదర్శ్ వర్మ గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా యువకుడు డబ్బులు ఇవ్వలేదని దారుణంగా కొట్టి చంపారు. హిజ్రాలు దాడి చేస్తున్నప్పుడు పక్కన ప్రయాణికులు ఎవరూ కనీసం అడ్డుకోలేదు. యువకుడిని కాళ్లతో తన్ని చనిపోయిన తర్వాత మృతదేహాన్ని రైలు నుంచి కింద పడేశారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.