కారు ఢీ.. గాల్లోకి ఎగిరి పడ్డాడు (వీడియో)

71చూసినవారు
రాజస్థాన్‌ ధోల్‌పూర్‌ సమీపంలో మే 23న ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. బసాయి నవాబ్ పట్టణంలోని మానియా రోడ్డుపై దరాబ్ సింగ్ అనే యువకుడు రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. రెప్పపాటులో రోడ్డు దాటుతున్న దరాబ్ సింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బాధితుడు గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. స్థానికులు ఆ యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :