ఈ జిల్లాలో వింత రోగాలు

80చూసినవారు
ఈ జిల్లాలో వింత రోగాలు
ఏలూరు జిల్లాలో వింత రోగాలు వ్యాపిస్తున్నాయి. చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామస్తులను దీర్ఘకాలిక రోగాలు కలవర పెడుతున్నాయి. విషజ్వరాలు, చర్మంపై మచ్చలు, నోప్పులతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నా ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారమే రోగాలకు కారణం అయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్