ద్రాక్షరామానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే?

54చూసినవారు
ద్రాక్షరామానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే?
పురాణాల ప్రకారం ద్రాక్షారామాన్ని దక్ష ప్రజాపతి పాలించాడని చెబుతారు. ఇక్కడే ఆయన దక్ష యజ్ఞం చేశారని, అందుకే ఈ ప్రాంతాన్ని దక్ష రామంగా పిలిచేవారు. అది కాలక్రమేణ ద్రాక్షారామంగా మారిందని అంటారు. అంతేకాదు, పూర్వం వేదవ్యాసుల వారు కాశీ విడిచి శిష్యసమేతంగా దక్షారామం వచ్చి భీమేశ్వరుని సేవించాడట. ఇక్కడ ఉంటే కాశీలో ఉన్నట్లే ఉంటుందనీ స్వయంగా అన్నపూర్ణ దేవి వేదవ్యాసులకి చెప్పిదని అందుకే దక్షిణ కాశీగా పేరొందిందని అంటారు.