శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూకు భారీగా డిమాండ్ పెరిగింది. లడ్డూ చుట్టూ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డూ విక్రయాలు తగ్గి ఉంటాయని భావించినప్పటికీ.. భారీగా లడ్డు విక్రయాలు పెరిగాయి. కల్తీ నెయ్యి వివాదం లడ్డూ విక్రయాలపై ప్రభావం చూపలేదు. లడ్డూ తయారీలో అపశ్రుతులు జరిగినా.. శ్రీవారి లడ్డూను పరమ ప్రవిత్రంగా భక్తులు భావిస్తున్నారు. ఈ నెల (సెప్టెంబర్)19వ తేదిన 3.59 లక్షలు, 20 వ తేదిన 3.16 లక్షలు, 21 వ తేది 3.66 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు.