భారీ వర్షాలతో నిండిన హుస్సేన్ సాగర్

59చూసినవారు
భారీ వర్షాలతో నిండిన హుస్సేన్ సాగర్
భారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్​కు వరద నీరు పోటెత్తుతోంది. వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి నీటిమట్టం 514.75 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 513.21 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై సాగర్​లోకి చేరుతున్న వరదనీటిని కిందికి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్