నీట్ పరీక్షల పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా ఘట్కేసర్ మండల పరిధిలోని ఉన్న ఎదులబాద్ జెడ్పిహెచ్ఎస్ లో గురువారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ కార్యదర్శి వీరబోయిన మహేష్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ల లికేజ్ వలన ఆందోళన చెందుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయి భరోసా కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.