ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శుక్రవారం రోజు ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శివలింగానికి భక్తులు పంచామృతాలతో అభిషేకం చేశారు. శివలింగాన్ని పుష్పాలతో అలంకరించారు. నందీశ్వరుని చెవిలో తమ కోరికని తెలిపారు. శివలింగం వద్ద, ధ్వజస్తంభం వద్ద, తులసి కోట వద్ద ఉసిరి దీపాలను, అఖండ దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. గుడి ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.