పాతబస్తీలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

1079చూసినవారు
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా శనివారం మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కుట్ర పన్ని ఈడి అధికారులు దాడులు చేసి అరెస్టు చేయడం సరైనది కాదని అన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్