జాతీయ పున నిర్మాణం ఏబీవీపీ లక్షం

681చూసినవారు
జాతీయ పున నిర్మాణం ఏబీవీపీ లక్షం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఆధ్వర్యంలో కోఠీ గోల్కొండ జిల్లాల సమ్మేళనం విజయవంతంగా ముగిసింది. గన్ ఫౌండ్రి కమిటీ హాల్ లో నిర్వహించారు. జెండా ఆవిష్కరణ జిల్లా కన్వీనర్ లు కళ్యాణ్, శ్రావణ్ చేయడం జరిగింది. తదుపరి ఉద్ఘాటన కార్యక్రమానికి ముఖ్య అతథిగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డా. రావుల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం విద్యార్థి సమస్యలపై పోరాడటంతో పాటు సమాజసేవలో ఉంటుందని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక పాలన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అంతం చేసే దిశగా పనిచేస్తారని తెలిపారు.

ఈ జిల్లా విద్యార్థి సమ్మేళనాల్లో విద్యారంగ స్థితి మరియు జిల్లా స్థితి తీర్మానాలు ప్రవేశపెడుతూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విభాగ కన్వీనర్ పృథ్వితేజ గారికి సమర్పించడం జరిగింది. తదుపరి ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ బహిరంగ సభలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృద్వి, కోఠీ జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్, గోల్కొండ జిల్లా కన్వీనర్ శ్రావణ్, సిరివెన్నెల వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యతిరేక ప్రజా వ్యతిరేక అభివృద్ధి వ్యతిరేక పాలన కొనసాగుతుందని తెలిపారు విద్యార్థులను విద్యావ్యవస్థను గాలికి వదిలేసి ఈ ముఖ్యమంత్రి సామోజుకే పరిమితమయ్యారని తెలిపారు. మత్తు పాన్యాలకు యువతను అలవాటు చేయడానికి రోజురోజుకు డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అధ్యాపకుల నియమించుకునే విషయంలో పూర్తిగా విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పాలన గనుక ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం గద్దె దింపడమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు విద్యార్థులను ఏకం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమాన్ని చేయడానికి వెనుకాడబోమని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మహానగర సంయుక్త కార్యదర్శి అక్షిత, నగర కార్యదర్శిలు నితిన్, నదీమ్, సురేష్, విద్యార్థి నాయకులు సాయి, దిలీప్ , రాహుల్, సజన్, సోనీ, దివ్య , ప్రియా, శృతి, రమేష్, అభినేష్, అరవింద్ హర్ష శ్రీధర్ , ప్రణయ్, నవీన్, నవీన్, రాకేష్, వినయ్ , శ్రీకాంత్, నరసింహ, కుమార్, ప్రతాప్, తరుణ్, యశ్వంత్ పూర్వ నాయకులు, కళాశాలల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్