పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ. తెలంగాణ బిడ్డ, బహుభాషాకోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో సంస్కరణలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడని గుర్తుచేశారు.