ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ కేటీఆర్ తో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, జయసింహ. క్రీశాంక్, గెల్లు శ్రీనివాస్ పై బంజారాహిల్స్ ట్రాపిక్ పోలీసుల ఫిర్యాదుతో 221, 292, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పోలీసులు తెలిపారు.