హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటిఆర్ పాల్గొని మాట్లాడుతూ.ఎన్నికల ముందు మార్పు మార్పు అని కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు పెట్టుబడులు రావని భయపెట్టారన్నారు. తొమ్మిదిన్నరేళ్ళ బి ఆర్ ఎస్ పాలనలో అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు.