కోలీవుడ్ హీరో విజయ్ మూవీస్ రిటైర్మెంట్ పై తాజాగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "విజయ్ సార్ రిటైర్‌మెంట్‌తో యావత్ తమిళనాడు షాక్‌లో ఉండిపోయింది. కానీ ఆయన నిర్ణయాన్ని మనమంతా తప్పకుండా గౌరవించాలి. విజయ్ ఒకవేళ ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే.. ఆయనతో నేను 'లియో 2' చేయాల్సి ఉండేది" అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.