కార్వాన్: రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

63చూసినవారు
నానల్ నగర్ డివిజన్ ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ నసీరుద్దీన్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని కాల బంగ్లా ప్రాంతంలో రోడ్డు పనులను కార్పోరేటర్ పరిశీలించారు. రూ. 25 లక్షలతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. కాల బంగ్లా నుంచి హకింపేట వరకు ఈ పనులు కొనసాగుతాయని వెల్లడించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కార్పొరేటర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్