వెయ్యి ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి వాటిని తిరిగి పోలీసులు అందజేశారు. రూ. 1కోటి 20లక్షల విలువైన 570 మొబైల్ ఫోన్లు బాధితులకు ఇచ్చారు. ఈ సంవత్సరం సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో దాదాపు వెయ్యి ఫోన్లు రికవరీ చేశామని శుక్రవారం డీసీపీ నర్సింహా తెలిపారు.