రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్ సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, అధికారులతో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తప్సీర్ ఎక్బల్ పాల్గొన్నారు.