విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) అధికారులు, ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. వీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. పూర్తిస్థాయి తాగునీటి సరఫరా జరిగేలా ట్యాంకుల నిర్మాణం ఉండాలన్నారు. బుడమేరు వరదతో దెబ్బతిన్న రోడ్లను మళ్లీ నిర్మిస్తామని తెలిపారు. డ్రెయిన్లలోని పూడికను త్వరగా తొలగించాలని ఆదేశించారు. విజయవాడలో కొందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.