వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే మన పోరాటమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బిసి కళానేతలు నిరుద్యోగ కళాకారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం అండగా నిలవడం తమకు ఎంతో శక్తిని ఇస్తుందని అన్నారు.